బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్. తీస్తుంది తెలిసిందే. అయితే ఈ సినిమాను అంతకుమించి లెవల్లో తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఈ సినిమాను జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కొరియా, జపాన్, చైనాతో పలు పలు భాషల్లో విడుదల చేసే పనిలో వున్నట్లు తెలిసింది.
ఇందుకు కారణం రాజమౌళి చెప్పిన సమాచారం ప్రకారం తెలుగు, తమిళం, మలయాళంతోపాటు బాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. వీరితోపాటు హాలీవుడ్ నటీమణులు, నటులు కూడా నటించారు. బ్రిటీష్ కాలం నాటి కథను మిళితం చేస్తూ తీయడంలో అక్కడి ప్లేవర్ మిస్ కాకుండా తెరకెక్కించారు. అక్కడ ప్రముఖులైన ఆ నటులు కనుక హాలీవుడ్‌లో కూడా ఇంగ్లీషులోనూ సినిమాను రిలీజ్ చేసే పనిలో వున్నాడని సమాచారం. కారణం వార్నర్ బ్రదర్స్ అనే ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగు సినిమా అంతకుమించి అన్నట్లుగా వుంటుందని చెప్పవచ్చు.