Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారతం మహాసముద్రం.. మోహన్‌లాల్ కొంత తీస్తే నేను కొంత తీస్తా.. జడవని జక్కన్న

మహాభారతం సినిమా తీసేది ఖాయమే కానీ అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను అన్నాడు బాహుబలి జక్కన్న. గతంలో పలు సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (03:14 IST)
ప్రపంచ మహాకావ్యాల్లో మెలోడ్రామాకు మారుపేరైన మహాభారతానికి చిత్ర రూపం ఇవ్వడంలో తెలుగువారిదే పేచేయి. మాయాబజార్, నర్తనశాల, పాండవ వనవాసం, వీరాభిమన్యు, శ్రీకృష్ణ పాండవీయం వంటి శ్రీకృష్ణ తులాభారం, దానవీర శూరకర్ణ, కురుక్షేత్రం వంటి అత్యద్భుత కథలతో మహాభారతానికి ప్రాణం పోసిన ఘనత దేశం మొత్తం మీద తెలుగు చిత్రపరిశ్రమకే దక్కింది. బాలీవుడ్ ఏనాడో ఈ సత్యాన్ని అంగీకరించింది. ఆధునిక సాంకేతికత మోజులో పడి పౌరాణిక సినిమాలు తీయడం అరుదైన నేటికాలంలో బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి మహాభారతంపై మళ్లీ ఆశలు మొలకెత్తించాడు. జక్కన్న  తీస్తానని చెబుతున్న జక్కన్నకు పోటీగా మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వెయ్యికోట్ల ఖర్చుతో దుబాయ్ కంపెనీ మహాభారతానికి దృశ్యరూపం ఇస్తానని ప్రకటించడం సంచలనం కలగించింది. అయితే ఎవరు తీసినా  మహాభారతాన్ని తన స్టయిల్లో తీయడం ఖాయమంటున్నాడు రాజమౌళి.
 
మహాభారతం సినిమా తీసేది ఖాయమే కానీ అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేను అన్నాడు బాహుబలి జక్కన్న. గతంలో పలు సందర్భాల్లో తాను మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నానని రాజమౌళి చెప్పటంతో బాహుబలి తరువాత మహాభారతమే సెట్స్ మీదకు వెళ్తుందని భావించారు. అయితే రాజమౌళి మాత్రం మహాభారతానికి తెర రూపం ఇచ్చేంత అనుభవం తనకింకా రాలేదని అందుకు ఇంకా సమయం పడుతుందని చెపుతూ వస్తున్నాడు.
 
బాహుబలి 2 రిలీజ్‌కు రెడీ కావటంతో రాజమౌళి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై చర్య మొదలైంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ 1000 కోట్లతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి రాజమౌళి మహాభారతం చర్చకు వచ్చింది. మోహన్‌లాల్ అంత భారీగా రూపొందించిన తరువాత తిరిగి రాజమౌళి అదే కథను తీస్తాడా అన్న అనుమానం వ్యక్తం అయ్యింది. అయితే ప్రస్తుతం బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న జక్కన మహాభారతం తీసే ఆలోచనపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తాను తప్పకుండా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పాడు. అయితే అదే మరో ఏడాదిలోనా.. లేక పదేళ్ల తరువాతనా అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. మహాభారతం మహాసముద్రమన్న జక్కన అందులో మోహన్ లాల్ టీం కొంత తీస్తే నేను కొంత తీస్తానని అలా ఎంతమందైనా చేయోచ్చని తెలిపాడు. 
 
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments