Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 19వ సినిమా టైటిల్ సాహో... ‘బాహుబలి–2’తో పాటు ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ విడుదల

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా టైటిల్ విషయంలో స్పష్టత వచ్చింది. సాహో.. బాహుబలి2 సినిమాలోని ‘భళి భళి భళి రాభళి... సాహోరే బాహుబలి’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అందులోని ‘సాహో’ను తాజా స

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (01:24 IST)
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా టైటిల్ విషయంలో స్పష్టత వచ్చింది. సాహో.. బాహుబలి2 సినిమాలోని ‘భళి భళి భళి రాభళి... సాహోరే బాహుబలి’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అందులోని ‘సాహో’ను తాజా సినిమాకు టైటిల్‌గా తీసుకున్నారు. సో. ప్రభాస్ 19వ సినిమా టైటిల్‌ ‘సాహో’నే.

బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ కోసం దాదాపు ఐదేళ్లు అన్ని ప్రాజెక్టులనూ పక్కన పెట్టేశాడు. ఎట్టకేలకు ‘బాహుబలి-2’ కూడా విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి కనబడుతోంది. ఆ సినిమాకు టైటిల్ ఏంటి? దర్శకుడు ఎవరు? అనే విషయాలపై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
 
సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న సినిమాకు ‘సాహో’ టైటిల్‌ ఖరారు చేసినట్టు ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. యంగ్‌ రెబల్‌ స్టార్‌ అభిమానులకు ఇది శుభవార్తే.
 
 



ఆదివారం టైటిల్‌ ప్రకటనతో పాటు ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అటువంటిది ఏదీ జరగలేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘బాహుబలి–2’తో పాటే ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కళ సాబు సిరిల్, కెమెరా మది, సంగీతం శంకర్‌–ఎహసన్‌–లాయ్‌.
 
బాహుబలికి కమిట్ అయిన అయిదేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహోలో ప్రభాస్ పవర్‌పుల్ పోలీసాఫిసర్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments