Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆది పురుష్"కు పెరుగుతున్న మద్దతు.. ముంబైలో గూండాగిరీ చెల్లదు?

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (20:52 IST)
Adipurush
ఆది పురుష్ సినిమా పవిత్రమైన రామాయణం సినిమాను తప్పుదోవ పట్టిస్తున్నారనే వివాదాన్ని ఎదుర్కొంటుంది. ఇంకా ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపివేస్తామని వాగ్దానాలు కూడా చేస్తున్నాయి కొన్ని హిందూ సంఘాలు. కానీ ఇప్పుడు అలా సినిమాను ఆపేస్తామని వాగిన ప్రతి ఒక్కరికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు.
 
నిజానికి ఓమ్ రౌత్ అందరికంటే పెద్ద హిందూ భక్తుడు. గొప్ప శివ భక్తుడు.. రామభక్తుడు.. రావణాసురుడు భక్తుడు కూడా.. అందుకే ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తో పాటు మరికొంతమంది నాయకులు ఓమ్ రౌత్ కి మద్దతుగా నిలుస్తున్నారు. 
 
ఇక ఈ సినిమాను ఎవరు బాయ్ కాట్ చేయలేరు అని , ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి 2023 జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుందని ప్రభాష్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేకాదండోయ్.. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఆదిపురుష్ చిత్రానికి మద్దతు ప్రకటించింది. ఎంఎన్ఎస్ పార్టీ నేత, సినీ నిర్మాత అమేయ ఖోప్కార్ దీనిపై స్పందించారు. 
 
"దర్శకుడు ఓం రౌత్‌కు, ఆదిపురుష్ చిత్రానికి మేం మద్దతు ఇస్తున్నాం. ఈ సినిమా ఎలా విడుదలవుతుందో చూస్తామని మీరు (బీజేపీ) అంటున్నారు... కానీ మహారాష్ట్రలో ఇలాంటి గూండాగిరీ చెల్లదు. ఆదిపురుష్ సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుంది... అందుకు మేం మద్దతుగా నిలుస్తాం. కేవలం టీజర్ చూసి ఈ సినిమాను ఆపేస్తామంటూ మీ చెత్త రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలోచించడం నేర్చుకోండి.."  అని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments