స్టార్ హీరో ప్రభాస్ రెబెల్ పదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో రీ-రిలీజ్ కాబోతుంది. రొటీన్ పాయింట్ కారణంగా రెబెల్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా విషయంలో నిర్మాతలకు లారెన్స్‌తో విభేదాలు వచ్చాయి.
కాగా ఈ ఫ్లాప్ సినిమాను థియేటర్లలో మళ్లీ రీ-రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ పుట్టినరోజును సందర్భంగా అక్టోబర్ 15న రీ-రిలీజ్ కానుంది. రెబెల్ సినిమాను నట్టికుమార్ రీ-రిలీజ్ చేయనున్నారు.
రెబెల్ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సంగీతాన్ని లారెన్స్ అందించాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది.
రామాయణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది.