Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరగబడరసామీ అంటున్న రాజ్ తరుణ్

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (19:25 IST)
Raj Tarun, Malvi Malhotra
రాజ్ తరుణ్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది.
 
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
హీరోయిన్, రాజ్ తరుణ్ ను ఎత్తుకున్నట్లు వున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే తో పాటు రఘు బాబు, జాన్ విజయ్, పృధ్వి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమెరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్ అందిస్తున్నారు.
 
తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments