Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కుంద్రా పరిస్థితి గోవిందా.. Raj Kundra: అశ్లీల వీడియోలు డిలీట్!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (12:19 IST)
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కేసులో నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. అతని ఉద్యోగులు చెబుతున్న మాటలే ఆయనకు ఉచ్చుబిగిసేలా చేసే సమస్యను తీవ్రం చేస్తున్నాయి. రీసెంట్‌గా పోర్నోగ్రఫిక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనే కేసులో ఇరుక్కున్న రాజ్‌కుంద్రాపై అతని ఉద్యోగులు పోర్న్ వీడియోలు డిలీట్ చేయాలని చెప్పినట్లు పోలీసులకు తెలిపారు.
 
అంతేకాకుండా ఆ క్లిప్‍లను హాట్‌షాట్స్ నుంచి అప్ లోడ్ చేసినట్లు కన్ఫామ్ చేశారు. దాంతో ఈ యాప్ కాంట్రవర్షియల్ కోణం తీవ్రమైంది. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్, ఆపిల్ స్టోర్ నుంచి తొలగించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు ప్లాన్ బీ యాక్టివేట్ చేసి బాలీఫేమ్ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలిసింది.
 
జులై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన రాజ్ కుంద్రాను జులై 27న పోలీస్ కస్టడీకి పంపింది మెజిస్ట్రేట్ కోర్ట్. అతని అరెస్ట్ తర్వాతి రోజున పెద్ద మొత్తంలో డేటా డిలీట్ అయినట్లు రికార్డులు చెబుతున్నాయని పోలీసులు అంటున్నారు. 
 
ఇంటిలిజెన్స్ బ్యూరో ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. పరారీలో ఉన్న యశ్ ఠాకూర్ అనే మరో నిందితుడి నుంచి లింకులు దొరికాయని చెప్పారు. ఆ క్లిప్పులను స్ట్రీమ్ చేసేందుకు యాప్ ప్రారంభించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానంలో మహిళ ప్రయాణికురాలి వికృత చేష్టలు!

YS Jagan: తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్ దాఖలు

Summer Holidays: మార్చి 15 నుండి హాఫ్-డే సెషన్‌.. ఏప్రిల్ 20 సెలవులు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాల పరిధిలోనే ప్రయాణం.. వేరే జిల్లాలకు నో జర్నీ

పీకల వరకు మద్యం సేవించారు.. బైకును ఢీకొట్టి.. బైకర్‌నే బెదిరించిన యువతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం