Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో పదిమంది దాడి.. ఎమ్మెల్యే రోహిత్ బంధువులపై రాహుల్ ఫిర్యాదు..

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:31 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ దాడికి గురైనట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై ఫిర్యాదు చేశాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. 
 
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు. తనతో ఉన్న యువతులపైనా రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని చెప్పాడు. 
 
కాగా బుధవారం రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమె పై కొంత మంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై నిలదీసిన రాహుల్‌పై దాడి జరిగింది. దీంతో అతనని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments