Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగిణి ద్వివేది ప్రధానపాత్రలో జనార్ధన మహర్షి రూపొందిస్తున్న చిత్రం శ్లోక ఫస్ట్‌లుక్‌

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (14:29 IST)
Ragini Dwivedi
ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధనమహర్షి స్వీయ దర్శకత్వంలో సర్వేజనాఃసుఖినోభవంతు ఫిలింస్‌ పతాకంపై జనార్ధన మహర్షి కుమార్తెలు శ్రావణి, శర్వాణిలు నిర్మాతలుగా తెరకెక్కుతున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’.  హీరోయిన్‌ రాగిణి ద్వివేది ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రమిది. రుధ్రభూమిలోకి (స్మశానంలోకి) వెళ్ళి ప్రకృతి ఆకృతితో మాట్లాడుతూ ఉండే ప్రత్యేకమైన యువతి పాత్రలో ‘శ్లోక’ చిత్రంలో కనిపించనున్నారు రాగిణి.
 
సెప్టెంబర్‌ 5వ తేది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా చిత్రాన్ని సంస్కృత టీచర్స్‌కి అంకితమిస్తున్నాం అన్నారు చిత్ర దర్శకులు మహర్షి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘ఇప్పటివరకు సినిమాలోని కీలకమైన రుధ్రభూమి సన్నివేశాలను బెంగుళూరు, మైసూర్‌లో జరిగిన షెడ్యూల్స్‌లో తెరకెక్కించాం. రాగిణితో పాటు కీలకమైన అనేక సన్నివేశాలను దేశంలోనే పురాతనమైన అనేక స్మశానాలలో షూటింగ్‌ జరుపుకోవటం జరిగింది. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఈ స్మశానలలో షూటింగ్‌ చేయటం జరిగింది. ఈ స్మశానాల ప్రత్యేకత ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది.  
 
సంస్కృతంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనేక భారతీయ భాషల్లో డబ్బింగ్‌ చేయటం జరుగుతుంది. ఒక సంస్కృత విధ్యార్థిగా సినిమాని సంస్కృతంలో తీస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను. భారతీయుల గొప్పతనానికి ప్రతీకైన సంస్కృత భాషని  మరింత ప్రపంచ ప్రసిద్ధం చేయాలన్నది మా వంతుగా నా లక్ష్యం.  భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి చిత్రాలు సంస్కృతంలో తీస్తాను’’ అన్నారు. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, తనికెళ్లభరణి, వజ్రేశ్వరి కుమార్, గురు దత్, జాక్‌మంజు, సూరప్పబాబు, ఆదిత్య, బద్రి దివ్యభూషన్, సందీప్‌ మలాని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయిత– సంగీత దర్శకుడు– దర్శకుడు– జనార్ధన మహర్షి
బ్యానర్‌– సర్వేజనాసుఖినోభవంతు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments