Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్‌బాస్ తెలుగు 8: రొమాంటిక్ టచ్ మొదలు.. ఎవరి మధ్య?

Advertiesment
Nagarjuna

సెల్వి

, బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:54 IST)
Nagarjuna
బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇప్పుడే కంటిస్టెంట్ల మధ్య వార్ మొదలైంది. ముఖ్యంగా సోనియా, యాష్మీ, కిర్రాక్ సీతలు సదా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. హౌస్ ఇంత హాట్ హాట్‌గా మారిపోతుండటంతో రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ తన యత్నాలు మొదలుపెట్టినట్లుగా అనిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ- పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది.
 
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో నెగ్గి తొలుత నిఖిల్ తర్వాత నైనికలు చీఫ్‌లుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడో చీఫ్‌ను సెలెక్ట్ చేసే బాధ్యతను నిఖిల్ - నైనికలకే అప్పగించారు బిగ్‌బాస్. దీంతో వారిద్దరూ కలిసి డిష్కస్ చేసుకుని యాష్మీ గౌడను థర్డ్ చీఫ్‌గా ప్రతిపాదించారు.  
 
ఇక నామినేషన్స్ డే నాడు ఇంట్లో గొడవలు మామూలే . అందుకు తగినట్లుగా మంగళవారం హౌస్ అరుపులు, కేకలతో మోతేక్కిపోయింది. నిఖిల్, నైనిక, యాష్మీలు చీఫ్‌లు కావడంతో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. 
 
ఇకపోతే బిగ్ బాస్ నుంచి పరమేశ్వర్ హిర్వాలే తప్పుకున్నారని టాక్. టాలీవుడ్‌లో నటుడిగా, డైరెక్టర్‌గా సుపరిచితుడు అయిన అతడు.. చివరి నిమిషంలో షో నుంచి తప్పుకున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.
 
పరమేశ్వర్ హిర్వాలేను బిగ్ బాస్ నిర్వహకులు ఫైనల్ చేసిన సంగతి వాస్తవమే. అంతేకాదు, అతడు షోకు రెండు రోజుల ముందు కూడా టచ్‌లో ఉన్నాడు. అయితే, ఒక్కసారిగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అలాగే, ఆస్పత్రిలో సైతం చేరాల్సి వచ్చింది. అప్పుడు వైద్యులు అతడికి కొద్ది రోజులు రెస్ట్ సూచించారట. ఈ కారణంగానే పరమేశ్వర్ షోలోకి ఎంట్రీ ఇవ్వలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు