Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

దేవీ
మంగళవారం, 25 మార్చి 2025 (18:48 IST)
Raghubabu
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న థియేటర్లోకి రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కన్నప్ప టీం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది.
 
ఈ క్రమంలో మంగళవారం నాడు రఘు బాబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కన్నప్ప చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషించారు. ఈ కారెక్టర్‌ను రివీల్ చేస్తూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
 
రఘు బాబు ఈ పోస్టర్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఏదో యాక్షన్ సీన్ కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌ను, రుద్రుడిగా ప్రభాస్‌ను, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments