Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్ 'శివ‌లింగ' ట్రైల‌ర్‌కు 10 ల‌క్ష‌ల వ్యూస్‌

కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ న‌టించిన తాజా చిత్రం ‘శివ‌లింగ’ త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. `చంద్ర‌ముఖి` వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:01 IST)
కొరియోగ్రాఫర్‌, డైరెక్ట‌ర్, హీరోగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ న‌టించిన తాజా చిత్రం ‘శివ‌లింగ’ త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. `చంద్ర‌ముఖి` వంటి సంచ‌ల‌న చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన `శివ‌లింగ` చిత్రాన్ని అదే టైటిల్‌ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్‌కి అసాధార‌ణ‌మైన వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో 10 ల‌క్ష‌ల వ్యూస్ సాధించింది ట్రైల‌ర్‌. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'కథే హీరోగా కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రమిది. పి.వాసు 'చంద్రముఖి' ఎంత‌టి సెన్సేష‌నో తెలిసిందే. అలాగే లారెన్స్ కాంచన, గంగ ఏ స్థాయిలో విజ‌యాలు సాధించాయో తెలుసు. వాటిని మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్టైనర్‌గా శివలింగ తెరకెక్కుతోంది. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రైల‌ర్‌, పోస్ట‌ర్‌కు మంచి స్పందన వ‌స్తోంది. ఇప్ప‌టికే యూట్యూబ్‌లో 10 ల‌క్ష‌ల మంది ట్రైల‌ర్‌ని చూశారు. ఈనెల‌లోనే సినిమాని రిలీజ్ చేయ‌నున్నాం. హార్రర్ కాన్సెప్ట్‌లపరంగా శివలింగ నెక్ట్స్‌లెవెల్‌లో ఉండే చిత్రం' అని తెలిపారు. 

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments