బాహుబలి-2కు సంబంధించిన ప్రభాస్, అనుష్క పోస్టర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ఉన్న తప్పును నెటిజన్లు కనిపెట్టేశారు. అనుష్క, ప్రభాస్ బాణాలు సంధిస్తూ ఉన్న పోస్టర్‌ను ఇటీవలే విడుదలైన సంగతి
బాహుబలి-2కు సంబంధించిన ప్రభాస్, అనుష్క పోస్టర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ఉన్న తప్పును నెటిజన్లు కనిపెట్టేశారు. అనుష్క, ప్రభాస్ బాణాలు సంధిస్తూ ఉన్న పోస్టర్‌ను ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ముందు అనుష్క, వెనుక ప్రభాస్ నిల్చుని విల్లు ఎక్కుపెట్టే విధంగా ఉంటుంది. వెనుక నిల్చున్న ప్రభాస్ ఎక్కుపెట్టిన బాణాలు ముందున్న అనుష్క విల్లుపై కనిపిస్తాయి. ఈ తప్పును నెటిజన్లు కనిపెట్టేశారు. దీంతో రాజమౌళిపై నెగటివ్ వార్తలు వచ్చేశాయ్. ఆ వార్తలకు చెక్ పెట్టే క్రమంలో జక్కన్న ఆ తప్పును సవరించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు.
ఇకపోతే.. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బాహుబలి చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలి పార్ట్ అత్యధిక కలెక్షన్స్ సాధించి పాత రికార్డులను తుడిపేయగా, ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ కాక ముందే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటూ అందరికి షాక్ ఇస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో సీజీ వర్క్స్ జరుపుకుంటున్నది.
బాహుబలి చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానుండగా హిందీలో కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్ పై విడుదల చేస్తున్నాడు. కేవలం హిందీలోనే బాహుబలి ది ఎండింగ్ రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇక మొత్తంగా బాహుబలి2 రూ. 500 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.