బాల్యం నుంచి న్యూడ్ సినిమాలు చూశా... అదో సైకో మెంటాలిటీ

Webdunia
గురువారం, 18 జులై 2019 (10:28 IST)
తాను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగానని అందువల్ల తాను న్యూడ్ సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బందులు ఎదురుకాలేదని నటి రాధికా ఆప్టే చెప్పుకొచ్చింది. "స్లమ్ డాగ్ మిలియనీర్" పేమ్ దేవ్ పటేల్‌తో కలిసి రాధికా ఆప్టే కలిసి నటించిన చిత్రం ద వెడ్డింగ్ గెస్ట్. ఈ చిత్రంలో వీరిద్దరూ పలు సన్నివేశాల్లో న్యూడ్‌గా నటించారు. వీటిలో ఓ సన్నివేశాన్ని ఎవరో లీక్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని అడ్డుపెట్టుకుని రాధికా ఆప్టేను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
దీనిపై రాధికా ఆప్టే స్పందించారు. సమాజంలో నెలకొనివున్న సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ సీన్‌ లీక్ కావడమే ఉదాహరణని ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఈ సీన్‌లో తనతో పాటు నటించిన దేవ్ పటేల్‌కు బదులుగా, తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. 
 
పైగా, ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయనీ, వాటినన్నింటినీ వదిలి కేవలం శృంగార సన్నివేశాలను మాత్రమే లీక్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ పని ఉద్దేశ్యపూర్వకంగానే చేసినట్టు తెలుస్తోందన్నారు. 
 
అంతేకాకుండా, బోల్డ్ సీన్లలో నటించేందుకు తానేమీ భయపడబోనని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని, నటులు వేదికపై నగ్నంగా నటించడాన్ని కూడా తిలకించానని తెలిపింది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించిన ఆమె, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తానని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం