Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను కదిలించాడు.. ఇప్పుడేమో విశాల్‌ను పట్టుకున్నాడు.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:25 IST)
ఇటీవల నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన తమిళ సీనియర్ నటుడు రాధారవి... తాజాగా స్టార్ హీరో విశాల్ గురించి చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల నయనతారను కించపరుస్తూ రాధారవి చేసిన కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విశాల్... ‘‘రాధారవి గారూ.. మహిళల గురించి, ముఖ్యంగా ఒక నటిని గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు.. మీ పేరులోని 'రాధ'ను తొలగించి.. 'రవి' అని మాత్రమే పిలుపించుకోండి’’ అంటూ ట్వీట్ చేసాడు.
 
ఈ ట్వీట్‌కి ప్రతిస్పందించిన రాధారవి వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ... "విశాల్‌కి ఏమీ తెలియదు.. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. 'రాధ' అనేది మా తండ్రిగారి పేరు.. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది" అని ట్వీట్ చేసారు. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న కోలీవుడ్‌లో రాధారవి కారణంగా ఏదో అలజడి రేగబోతోన్నట్లు ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments