Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానమంటే ఇదికదరా! మార్మోగిపోతున్న గ్లోబల్ స్టార్ ఇమేజ్!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:00 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ పేరు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. 'బాహుబలి', 'సాహో', 'సలార్' వంటి పాన్ ఇండియా మూవీలతో ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరు ఉండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశం అయిన నేపాల్‌లో ఉండటం విశేషంగా మారింది. 
 
ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా, ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తాను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరు ఎపుడైన ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూశారా అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు.
 
అయితే, ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక కథ ఏమిటి అన్నది మాత్రం తెలియరాలేదు. అయితే, ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడు పేరుతో ఒక గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది నేపాల్‌లోని ఒక చిన్నపట్టణం అయినప్పటికీ దీన్ని గర్వకారణంగా అభిమానులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: పబ్‌లో 30 ఏళ్ల మహిళపై మాజీ ప్రేమికుడి దాడి.. ఏమైంది..?

హైదరాబాద్‌లో పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు-11మంది అరెస్ట్

ఇకపై సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు యేడాదికి రెండుసార్లు!

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments