Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్ లక్ష్మీకి ప్రమాదం.. మోకాలికి గాయం... ఎలా?

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (17:36 IST)
టాలీవుడ్ నటి రాయ్‌ లక్ష్మీ ప్ర‌మాదానికి గురయ్యారు. హైద‌రాబాద్‌లో సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయింది. దీంతో ఆమె మోకాలికి గాయ‌మైంది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ఫొటోలు ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.
 
లక్ష్మీ రాయ్.. పేరు మార్చుకుని రాయ్ లక్ష్మీ అయిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ బిజీ అయిపోయింది. అక్కడ కూడా సినిమాలు చేసింది. "జూలీ 2" వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అందాలనే ఆయుధంగా చేసుకుని వరస అవకాశాలు అందుకుంటుంది. 
 
ఇదిలావుంటే షూటింగులో భాగంగా ఈమెకు యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉంది. మార్చి 20 అర్థరాత్రి బంజారాహిల్స్‌లో 2 గంటల సమయంలో షూటింగ్ చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది.
 
ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రాయ్ లక్ష్మీకి గాయాలయ్యాయి. ఈ ఫొటోలను కూడా పోస్ట్ చేసింది ఈ భామ. యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తున్న సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న వాళ్లంతా కేకలు వేస్తూ ఆమెను పైకి లేపారు.
 
కాగా, తెలుగులో బాలకృష్ణ "అధినాయకుడు" లాంటి సినిమాలలో హీరోయిన్‌గానూ నటించింది. కానీ ఈమెకు టైమ్ కలిసిరాలేదంతే. దీంతో ఐటం క్వీన్‌గా మారిపోయింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. బలుపు, సర్ధార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లోనూ ఐటం సాంగ్స్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments