టాలీవుడ్ హీరోయిన్లలో హంసా నందిని ఒకరు. పలు చిత్రాల్లో నటించిన ఈమెకు ఆ తర్వాత సినీ అవకాశాలు పెద్దగా రావడం లేదు. దీంతో అడపాదడపా ఐటమ్ సాంగుల్లో మెరుస్తోంది.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పుడూ ఏదో స్టిల్‌ను పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆరడుగుల అందం హంసానందిని కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
పొట్టి తెలుపు రంగు డ్రెస్‌లో పొడవాటి కురులతో ముగ్దమనోహరంగా ఉన్న హంసానందిని చేతులు చాచి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఇపుడు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఓ వైపు ప్రకృతి సోయగం, మరోవైపు పడచు అందం కలగలపిన సీనరీ అందరినీ కట్టిపడేస్తున్నాయి.