ఇటీవలే జపాన్‌లో కూడా ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదలైంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్‌ను చిత్ర ప్రధాన తారాగణం ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు హాజరై శుభారంభాన్నిచ్చారు. అదేవిధంగా న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డును కూడా ఇటీవలే ఆ చిత్రం తరఫున రాజమౌళి హాజరై అందుకున్నారు. త్వరలో ఆస్కార్ అవార్డు పొందడానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రమోషన్‌కే భారీగానే ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక, జపాన్‌లో ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదలై 80 రోజుల్లో 505 మిలియన్ యెన్‌లు రాబట్టిందని చిత్ర నిర్మాత డి.వివి. దానయ్య కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశాడు. 50,50,00,000 జపనీస్ యెన్ 31,49,47,542.50 భారత రూపాయికి సమానం. ఇందుకు తాము చాలా ఆనందంగా వున్నామనీ, ఆర్.ఆర్.ఆర్. సినిమా ప్రపంచ మొత్తాన్ని ఆకర్షించడం మరింత సంతోషంగా వుందని ఆయన పేర్కొన్నారు.