Webdunia - Bharat's app for daily news and videos

Install App

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

దేవీ
శనివారం, 31 మే 2025 (18:29 IST)
Nattikumar
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ లపై  విప్లవ చిత్రాల నటుడు ఆర్.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయంపై ఆర్.నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. దీనిపై హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా నట్టి కుమార్ స్పందిస్తూ,  "ఆర్.నారాయణమూర్తితో నాకు సుదీర్ఘ అనుబంధంతో పాటు పేదల పక్షాన నిలిచే ఆయన అంటే నాకు మొదట్నుంచి ఎంతో గౌరవం ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచి ఆయన వైఖరిలో పెద్ద మార్పు వచ్చింది. వైసీపీ వాళ్లు ఏమి అరాచకాలు చేసినా, సినీ పరిశ్రమకు ఎలాంటి మేలు చేయకపోయినా వారికి వత్తాసు పలుకుతూ వస్తుండటం ఆయనలోని మార్పుని ఎవరికైనా ఇట్లే అర్ధమయ్యేలా చేస్తుంది. గతంలో  అప్పటి  సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ పెట్టినప్పుడు... ఆ మీటింగుకు  చిరంజీవి, ప్రభాస్ వంటి పలువురు పెద్ద హీరోలు వెళ్లారు. దానికి ఆర్ . నారాయణమూర్తి వెళ్లారు.
 
ఆ రోజు  చిరంజీవి వంటి  పెద్దలను అవమానపరచినపుడు మీరు ఏమి మాట్లాడగలిగారు. ఎప్పట్నుంచో డిమాండ్ ఉన్న చిన్న సినిమాకు ఐదో షో ఇప్పించగలిగారా?  జగన్ హయాం కేసిఆర్ హయాంలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు మీరెందుకు స్పందించలేదు.."హరి హర వీరమల్లు" సినిమా విడుదల జూన్ 12వ  తేదీని ముందుగానే ప్రకటించినప్పుడు, మూడు వారాలు ముందుగా నోటీసు లేకుండా థియేటర్ల బంద్  ఎలా ప్రకటిస్తారు? . 
 
ఈ విషయం నారాయణమూర్తికి తెలియంది కాదు. కానీ కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారు. అందుకే వెనకా ముందూ, వాస్తవాలు పట్టించుకోకుండా ఆయన విమర్శలు పవన్ కల్యాణ్, దుర్గేష్ లపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఏ కార్పొరేట్ శక్తులు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. నారాయణమూర్ధ్ దీనిని ఖండిస్తే, ఆ విషయాలన్నీ నేను బయటపెడతాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో థియేటర్ క్యాంటీన్ల లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు టిక్కెట్ల రేట్ల కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలియంది కాదు. అప్పట్లో ఆ ప్రభుత్వంలో పోసాని కానీ మీలాంటి వాళ్లు కానీ ఏమీ చేయలేకపోయారు, మాట్లడలేకపోయారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఆ సమస్యల గురించి చరిస్తాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటే ఆయనను నారాయణమూర్తి విమర్శించడం ఎంతవరకు సమంజసం.
 
రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు.. థియేటర్ల  బంద్ బ్రహ్మాస్త్రం వంటిది. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది.  జగన్ చిన్న సినిమాలకు అసలు ఏం చేశారో నారాయణమూర్తి చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా  మీరు గుత్తాధిపత్యాన్ని ఎందుకు సమర్దిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీ భావాలు మారడమే ఇందుకు నిదర్శనమని అందరూ అంటున్నారు. సమస్యలను తీర్చాల్సింది  ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్స్  కౌన్సిల్ .కదా! అది కూడా మీకు తెలీదా!  ఎందుకు కావాలని పవన్ , దుర్గేష్ లను  టార్గెట్ చేశారు.

జగన్ ఆ  రోజు 5 రూ లకు,  35 రూలకు టికెట్ రేట్లు ప్రకటిస్తే  మీరు  ఏం చేశారు?. ఇంకొక నిర్మాత,  జనసేన నాయకుడు అంటూ ఓ ఎగ్జిబిటర్ గురించి కామెంట్స్ చేశారు. కావాలనే జనసేన పార్టీ పేరు తెస్తున్నారు.. ఆ నలుగురు వల్లే ఎవరికి న్యాయం జరగటం లేదు..
ఈ రోజుకు  చిన్న సినిమాలకు ఐదో  షో  రాలేదు.. తెలంగాణా లో భారీ రేట్లకు టిక్కెట్లు,  పుడ్ అమ్ముతుంటే మీరు ఎందుకు  ప్రశ్నించటం లేదు? గత ఐదేళ్లు మీరు ఇండస్ట్రీ ని ఇబ్బంది పెట్టారు.. ఆరోజు మీరు వాళ్లను ఎందుకు అడగలేదు. నిజమైన ఎగ్జిబిటర్ కు నష్ట  పోతుంటే మాట్లాడరు. పని కట్టుకుని కూటమీ ప్రభుత్వాన్ని,  పవన్ ను విమర్శిస్తున్నారు. ఆ రోజు ఈ రోజు చిన్న సినిమాలకు సపోర్ట్ గా మాట్లాడింది నేనే." అంటూ ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Three Capitals: 2029 తర్వాత తాడేపల్లి నుంచే జగన్ కార్యకలపాలు- సజ్జల మాటల అర్థం ఏంటి?

India First AI Village: భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ గ్రామం ఎక్కడుందో తెలుసా?

86 శాతం పనులు పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్-రామ్మోహన్ నాయుడు

Amaravati: అమరావతిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నోవోటెల్ హోటల్

శ్మశానవాటిక లోపల ఓ మహిళ సెక్స్ రాకెట్ నడిపింది.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

తర్వాతి కథనం
Show comments