Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన థియేటర్ యజమానులు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (09:57 IST)
ప్రముఖ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ, తెలంగాణాలోని పీవీఆర్ సినిమా, ఐనాక్స్ సినిమాస్‌లు తేరుకోలేని షాకిచ్చారు. ఆయన తాజాగా తెరకెక్కించిన "డేంజరస్" చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు నిరాకరించారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య ఆకర్షణ, ప్రేమ, వారి మానసిక పరిస్థితి వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
 
 
పైగా, ఒక క్రైమ్ థ్రిల్లర్. భారతదేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇందులో ఇద్దరు అమ్మాయిల మధ్య డ్యూయెట్ సాంగ్ కూడా ఉంది. ఈ నెల 8వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్ బోర్డు మంజూరు చేసింది. 
 
ఇపుడు ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు నిరాకరించారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్‌లు ఖత్రా (డేంజరస్) చిత్రాన్ని ప్రదర్శించేందుకు నిరాకరించాయి. సుప్రీంకోర్టు సెక్షన్ 377ను రద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుది. ఎల్జీబీటీ కమ్యూనిటి మాత్రమే కాకుండా పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్‌కు వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది మానవ హక్కులను అవమానించడమే అవుతుంది అని వర్మ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments