Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లూ ఫిల్మ్‌ తెలుసు మ‌రి బ్లూ బుక్‌ గురించి తెలియ‌దు - రామ్‌గోపాల్ వ‌ర్మ‌

Advertiesment
Ramgopal Varma
, శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:46 IST)
Ramgopal Varma, Kant Risa, Tanikella Bharani and others
నాకు మరియు బుద్ధుడికి మధ్య ఎలాంటి పోలిక లేదు, నేను వైన్‌ మరియు స్త్రీల వెనక పడితే బుద్ధుడు దేవుని కోసం అన్వేషించాడని రామ్‌ గోపాల్‌ వర్మ, ఒక  పుస్తకంపై వాఖ్యానించాడు.
 
వివ‌రాల్లోకి వెళితే, తరచు వివాదాలలో నిలిచే ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ రామ్‌ గోపాల్‌ వర్మపై కాంత్‌ ‘ రిసా చేతి వ్రాతతో రాసినటువంటి ఒక ప్రత్యేకమైన పుస్తక సంకలనమే ఆర్‌జివి ది బ్లూ బుక్‌. ఆర్‌జివి యొక్క నిగూఢమైన వ్యక్తిత్వం, అతడి జీవితతత్వం, అంతర్దృష్టులు అవగాహనలపై అందించిన వివరణలు - పుస్తకాన్ని అమితమైన ఆసక్తితో చదివేలా చేస్తాయి. ఆధునిక ముద్రణా సాంకేతికతలు అందుబాటులో ఉన్న ప్రస్తుత యుగంలో, ఇది చేతితో వ్రాసినటువంటి అరుదైన పుస్తకాలలో ఒకటి. ఇది గత శతాబ్దికి చెందిన చేతివ్రాత మాన్యుస్క్రిప్ట్‌ల యొక్క సొగసైన సౌందర్యాన్ని మనకు గుర్తుకు తెస్తుంది.  ఉల్లాసవంతమైన అనేక దృష్టాంతాలు, కూర్పులు మరియు కళాకృతులతో, మొదటి సారిగా చేతివ్రాతతో రాసిన మరియు చేతితో గీసిన మాన్యుస్క్రిప్ట్‌లతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఈ పుస్తకం ముద్రించబడిరది.
 
ఫ్రెడరిక్‌ నిశ్చే, జీన్‌ పాల్‌ సార్త్రే, ఎనీ రాండ్‌, రమణ మహర్షి, ఓషో, కృష్ణమూర్తి వంటి తాత్విక ఆలోచనాపరులు మరియు రచయితల ద్వారా తత్వశాస్త్రంపై అనేక పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అయితే ఈ పుస్తకం ప్రస్తుత సమకాలీనానికి చెందిన వ్యక్తిపై వ్రాయబడినందున వాటన్నింటి కంటే ఇది ముందువరుసలో నిలుస్తుంది. తన నిజాయితీ, బలమైన నైతిక సూత్రాలపై రాజీ పడకుండా, సంక్లిష్టమైన విస్త్రృత ప్రపంచాన్ని తలదన్నే రీతిలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్న వ్యక్తి ఇక్కడ ఉన్నారు. వర్మ తన వ్యాఖ్యల ద్వారా ఏర్పడిన వివాదాలతో కలవరపడలేదు మరియు ఎప్పటిలాగే హాస్యం, సున్నితత్వం మరియు సృజనాత్మకతను కలిగివున్నారు.
 
వర్మ యొక్క చర్యలు, వాఖ్యలు, అంతర్దృష్టులు, ప్రవర్తన, హావభావాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, తర్కం, తార్కికం, వ్యంగ్యం మరియు ఇంకా మరికొన్ని అంశాలు చేర్చబడిన ఈ పుస్తకాన్ని స్క్రిప్ట్‌ చేయడానికి వర్మలోని సంక్లిష్ట లక్షణాలను రచయిత ఆరు నెలల పాటు లోతుగా పరిశోధించారు. ఈ ఆరు నెలల కాలంలో వర్మను ఒక తత్వవేత్తగా, మారు రూపంలో ఉన్న జ్ఞానిగా మరియు సాధారణ ప్రపంచానికి ఒక పిచ్చివాడిగా రచయిత గుర్తించాడు.
 
రామ్‌ గోపాల్‌ వర్మ ఈ పుస్తకంపై వ్యాఖ్యానిస్తూ, నాకు మరియు బుద్ధుడికి మధ్య ఎలాంటి పోలిక లేదు, నేను వైన్‌ మరియు స్త్రీల వెనక పడితే బుద్ధుడు దేవుని కోసం వెతికాడు.  స్త్రీని సృష్టించిన వ్యక్తిని మాత్రమే నేను గౌరవిస్తాను మరియు అతనికి మాత్రమే నేను నమస్కరిస్తానని అన్నాడు.
 
రామ్‌ గోపాల్‌ వర్మ పుస్తకావిష్కరణ సందర్బంగా మాట్లాడుతూ, నాతో సహా నేను ఎవరినీ సీరియస్‌గా తీసుకోను. బ్లూ బుక్‌ పేరుతో పుస్తకాన్ని రాశానని కాంత్‌రిసా చెప్పినప్పుడు, నాకు బ్లూ ఫిల్మ్‌ తెలుసునని మరియు బ్లూ బుక్‌ గురించి క్లూ లేదని చెప్పాను, అప్పుడు అతను నాకు ఫిలాసఫీ రంగు నీలం అని ఒక సిద్ధాంతం ఉందని చెప్పాడు.  కానీ నాకు అర్థం కాకపోయినా, అవతలి వ్యక్తి ఏదైనా గట్టిగా విశ్వసిస్తే, నేను అతనిని గౌరవిస్తాను. నన్ను బుద్ధునితో పోల్చడంలో నేను అంగీకరించలేదు, బుద్దుని ప్రకారం కోరిక అన్ని దుఃఖాలకు మూలకారణం, అది ఒక విఫలమైన తత్వశాస్త్రం. మీ కోరిక నెరవేరకపోతే మీరు పశ్చాత్తాపపడతారు, కాబట్టి మీకు కోరికలు ఉండకూడదనేది చింతించకూడదనేది ఈ తత్వశాస్త్రం  యొక్క అర్దం, ఇంతకంటే దారుణమైన తత్వం ఉండదు. జీవితం యొక్క మొత్తం పాయింట్‌ కోరిక మీద ఆధారపడి ఉంటుంది. మనము శూన్యమైన మనస్సుతో పుట్టాము, కానీ మన చుట్టూ ఉన్న ప్రభావాలు, వాటిలో కొన్నింటిని మనం గ్రహిస్తాము మరియు మరికొన్నింటిని మనం గ్రహించలేము, ఇవన్నీ ప్రత్యేకమైన భిన్నమైన వ్యక్తిత్వానికి దారితీస్తాయి. ఇది కొటేషన్ల పుస్తకం, ఇది కోట్‌లు మరియు స్కెచ్‌లతో కొత్త ప్రయోగం, ఇది సాధారణ పుస్తకానికి మరియు దీనికి మధ్య ఉన్న తేడా. నా ఉద్దేశ్యంలో విజయం అంటే మనకు నచ్చినది చేయడం, ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. స్కూల్‌ మరియు కాలేజీలో ఎక్కువ సమయం మనం వృధా చేసుకుంటాము.
 
కాంత్‌ ‘ రిసా మాట్లాడుతూ, నేను చూసిన ఆసక్తికరమైన వ్యక్తులలో వర్మ ఒకరు మరియు ఆయన గురించి మరింత లోతుగా అన్వేషించడానికి ప్రయత్నించాను.
 
తనికెళ్ల భరణి మాట్లాడుతూ, వర్మ కో`డైరక్టర్‌గా ఒక సినిమా ద్వారా నాకు పరిచయం, ఈ పుస్తకాన్ని ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి మరో జ్ఞానోదయం కలిగిన వ్యక్తిపై రాశారు.
 
ఐప్యాడ్‌లో స్క్రిప్ట్‌ చేయబడిన ప్రపంచపు తొలి పుస్తకంగా కూడా ఈ పుస్తకం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. శక్తివంతమైన మరియు స్పష్టమైన డిజిటల్‌ ఇలస్ట్రేషన్‌ యాప్‌, ‘ప్రొక్రియేట్‌’ను రచయిత ఇందుకోసం ఉపయోగించారు. యాప్‌ ఒక ఆర్ట్‌ స్టూడియోగా ఉన్నప్పటికీ మరియు పుస్తకాన్ని కంపోజ్‌ చేయడానికి సాధారణ కోర్సులో అనుకూలంగా లేనప్పటికీ, కాంత్‌‘రిసా తనకున్న అద్బుతమైన సాంకేతిక నైపుణ్యాలను పుస్తకాన్ని స్క్రిప్ట్‌ చేయడానికి ఉపయోగించారు. ఐప్యాడ్‌ల అన్‌ఎక్స్‌ప్లోర్‌డ్‌ యుటిలిటీని తెలియజేయడానికి యాపిల్‌ ఇన్‌కార్పోరేషన్‌తో ఈ పుస్తకం యొక్క కాపీ భాగస్వామ్యం చేయబడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినీ కథా రచయిత చిన్నికృష్ణపై రియల్టర్ల దాడి...