Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి తెర‌పై పి.వి.నరసింహరావు బయోపిక్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (10:17 IST)
PV- Davala sathyam
ఈరోజు అన‌గా జూన్ 28, సోమ‌వారంనాడు పి.పి. జ‌యంతి. ఈరోజే హైద‌రాబాద్‌లో టేంక్‌బండ్‌పైన ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పి.పి. విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. ఇక ఈరోజే పి.వి.పై సినిమా తీయ‌డానికి ఓ నిర్మాత ముందుకు వ‌చ్చాడు.
 
బహుభాషా కోవిదుడు, అసాధారణ ప్రజ్ఞా దురీణుడు, స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహరావు బయోపిక్ 'ఎన్టీఆర్ ఫిల్మ్స్" పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందిం చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకుముందు శ్రీహరితో "శ్రీశైలం" చిత్రాన్ని నిర్మించారు. 
 
పలు సూపర్ హిట్ చిత్రాల రూపకర్త, ప్రముఖ సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు-హిందీ భాషలతోపాటు మరికొన్ని ముఖ్య భారతీయ భాషల్లో తెరకెక్కే ఈ బయోపిక్ లోజాతీయస్థాయిలో సుపరిచితుడైన ఓ ప్రముఖ నటుడు పి.వి.నరసింహరావు పాత్రను పోషించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రి ప్రొడక్షన్ జరుపుకుంటూ అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022, జూన్ 28న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments