Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

ఠాగూర్
బుధవారం, 4 డిశెంబరు 2024 (10:09 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ నెల 5వ తేదీన విడుదలకు సిద్ధమైన పుష్ప-2 చిత్రానికి కొన్ని సమస్యలు ఎదురయ్యారి. నిజానికి ఈ చిత్రాన్ని త్రీడీ వెర్షన్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ, ఈ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో 2డీ వెర్షన్‌లోనే విడుదల చేయనున్నారు. గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 12 వేలకు పైగా స్క్రీన్‌లలో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
12వేలకు పైగా స్క్రీన్‌లలో వివిధ ఫార్మాట్లలో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సిద్ధమైంది. అయితే, ప్రస్తుతం 3డీ వెర్షన్‌లో మూవీ విడుదల కావడం లేదన్నది తాజా సమాచారం. 3డీ వెర్షన్‌లోనూ మూవీని షూట్ చేసినప్పటికీ దీని తాలూకు ఎడిటింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి అన్ని థియేటర్లలోనూ 2డీ వెర్షన్‌ను మాత్రమే ప్రదర్శించనున్నారని ప్రముఖ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 3డీ వెర్షన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం.
 
కాగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మొత్తం ఏడు ఫార్మాట్లలో (2డీ, 3డీ, ఐమ్యాక్స్, డాలీ, 4డీఎక్స్, డీబాక్స్, ఐస్) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్ దాదాపు రెడీ అయింది. ఏవైనా చిన్న చిన్న మార్పులు, చేర్పులు ఉంటే బుధవారం రాత్రిలోపు పూర్తి చేయాలని సుక్కు టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments