పురుషోత్తముడు మోషన్ పోస్టర్ లో హిట్ కనిపిస్తుంది : బ్రహ్మానందం

డీవీ
శుక్రవారం, 10 మే 2024 (15:49 IST)
Purushottamudu tem with Brahmanandam
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'పురుషోత్తముడు'. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమా  మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ,  రమేష్ తేజావత్ నిర్మాణ సారధ్యంలో రామ్ భీమన దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం పురుషోత్తముడు. టైటిల్ చాలా బాగుంది కదూ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జస్ట్ పోస్టర్ చూస్తుంటేనే సూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించాలని ఆ ఏడు కొండలవాడిని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని అలాగే హీరో రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది సంగీత పరంగా కుడా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర దర్శకులు రామ్ భీమన అన్నారు.
 
ఇక అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వెల్లడించారు.
 
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్ (నూతన పరిచయం), మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర, రాజ్ తిరన్ దాస్, అనంత్, సమీర్, సత్య, ప్రవీణ్, కవిత, విరాన్, సుభాష్, జ్వాల కోటి, రచ్చ రవి, నాగ భైరవ అరుణ్, ముక్తార్ ఖాన్, లక్ష్మణ్, కంచరపాలెం రాజు, హరిశ్చంద్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments