పూరీకి వార్నింగ్ ఇచ్చా.. అతనితో సినిమా చేయొద్దన్నారు: బాలకృష్ణ (video)

బాహుబలి భల్లాలదేవుడు ''యారీ విత్ రానా'' అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో.. ఎన్టీఆర్ బిగ్ బాస్ కంటే ఎక్కువగా రేటింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ షోకు నందమూరి హీరో బాలకృష్ణ ఇటీవల పైసావస

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (13:06 IST)
బాహుబలి భల్లాలదేవుడు ''యారీ విత్ రానా'' అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో.. ఎన్టీఆర్ బిగ్ బాస్ కంటే ఎక్కువగా రేటింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ షోకు నందమూరి హీరో బాలకృష్ణ ఇటీవల పైసావసూల్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి పాల్గొన్నాడు. బాలకృష్ణ తాను స్టార్ హీరోననే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ వేదికపై సందడి చేశారు. 
 
పైసా వసూల్ సెట్లో తనను అందరూ సార్ అని పిలిచేవారని.. పూరీ జగన్నాథ్ కూడా అలాగే పిలిచేవారని.. అయితే అలా పిలవొద్దని తాను వార్నింగ్ ఇచ్చినట్లు బాలయ్య తెలిపారు. పూరీ జగన్నాథ్‌తో ఈ సినిమా చేయొద్దని తనకు చాలామంది చెప్పారని.. ఆ మాటలేవీ పట్టించుకోకుండా తాను సినిమా చేశానన్నారు. బాలయ్య కోపిష్టి అని తనకి కూడా చాలామంది చెప్పారనీ, కానీ దగ్గరగా చూసిన తరువాత ఆయనేంటో తనకి తెలిసిందని పూరీ చెప్పుకొచ్చారు.
 
మరోవైపు.. రానా మాట్లాడుతూ.. బాలయ్య నటించిన కథానాయకుడు సినిమా రిలీజైన రోజు తాను పుట్టానని.. అందుకే బాలయ్యకు తనకు లింకుందన్నారు. బాలయ్య చిత్రాలను చూస్తూ తాను ఎదిగానన్నారు. కాగా బాలయ్య, పూరీలతో సాగిన యారీ విత్ రానా ఎపిసోడ్‌ను వీడియో ద్వారా చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ కోసం నా భార్యను చంపాను.. ప్రియురాలికి మెసేజ్ పంపిన డాక్టర్ భర్త

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments