Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరి మెహ‌బూబా ట్రైల‌ర్ రిలీజ్.. ఛార్మి షాకింగ్ రియాక్ష‌న్..? (Trailer)

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం "మెహబూబా". 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (10:23 IST)
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. తన తనయుడు ఆకాశ్ హీరోగా రూపొందించిన చిత్రం "మెహబూబా". 1971లో జరిగిన ఇండో-పాక్  యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌కు .. టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈనేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ ట్రైలర్ ద్వారా పూరి సింపుల్‌గా కథ చెప్పేశాడు. ఇది ఒక సైనికుడి ప్రేమకథగా, యుద్ధం.. ప్రేమకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు. అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది. మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం అంటూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి.
 
ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ సాధించింది. దీంతో పూరి కనెక్ట్స్ వ్యవహారాలు చూసుకునే నటి చార్మి స్పందించింది. రెండు గంటల్లోనే 5 లక్షల వ్యూస్ వచ్చిన విషయాన్ని పోస్టర్‌పై రాసి మాటల్లేవ్.. ఆనంద భాష్పాలే అని ట్వీట్ చేసింది.
 
ఈ సినిమాపై పూరి చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. ఇది త‌న‌యుడు ఆకాష్ లైఫ్‍కి సంబంధించింది కాబ‌ట్టి. మే 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మ‌రి.. ఈ సినిమా విజ‌యం సాధించి పూరికి పూర్వ వైభ‌వాన్ని తెస్తుంద‌ని ఆశిద్దాం. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments