డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... తనయుడు ఆకాష్‌తో తెరకెక్కించిన మెహబూబా సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయనున్నాడు అనేది ఇంకా ఎనౌన్స్ చ
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్... తనయుడు ఆకాష్‌తో తెరకెక్కించిన మెహబూబా సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయనున్నాడు అనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. అయితే పూరి నెక్ట్స్ మూవీని కూడా తనయుడు ఆకాష్ తోనే అంటూ వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల బన్నీతో పూరి సినిమా చేయనున్నాడు అంటూ టాక్ వినిపించింది. బన్నీ, పూరి మధ్య కథా చర్చలు అయితే జరిగాయట కానీ.. కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ సెట్ కాలేదని తెలిసింది.
ఇటీవల పూరి నెక్ట్స్ మూవీ కోసం నటీనటులు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాజా సమాచారం ప్రకారం.. పూరి తదుపరి చిత్రాన్ని ఆకాష్ తోనే చేయనున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈసారి ఆకాష్ ని మాస్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మరి.. ఈ సినిమాతో అయినా ఆకాష్ సక్సస్ సాధిస్తాడని ఆశిద్దాం.