Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ గేమ్ మీరే ఆడుకోండి.. బిగ్ బాస్‌పై పునర్నవి భూపాలం ఫైర్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (18:48 IST)
బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా మారింది. వచ్చేవారం ఎలిమినేషన్ కోసం ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో పునర్నవి, హిమజ, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, మహేశ్ నామినేట్ అయ్యారు. రవి కూడా నామినేట్ అయినప్పటికీ కెప్టెన్ బాబా భాస్కర్ తన విశేష అధికారాలను ఉపయోగించి.. అతడిని సేవ్ చేశాడు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమోను విడుదల చేసింది. 
 
అందులో బిగ్‌బాస్‌పై పునర్నవి భూపాలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మీ గేమ్ మీరే ఆడుకోండి" అని కోపంతో విరుచుకుపడింది. అంతకుముందు బిగ్ బాస్ హౌస్‌లోని గార్డెన్ ఏరియాలో పునర్నవి కూర్చుంది. వెనక నుంచి బాబా భాస్కర్, శిల్ప, వితిక, హిమజ వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేస్తారు. అనంతరం పూల్ నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. హౌజ్‌మేట్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అది ఒకవేళ టాస్క్ అయినప్పటికీ.. అలా మ్యాన్‌హ్యాండ్లింగ్ చేయడమేంటని మండిపడింది. బిగ్‌బాస్ ఇవేం టాస్కులు అంటూ మండిపడటమే కాకుండా.. మీ గేమ్‌ని మీరే ఆడుకోమని.. వాకౌట్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. మరి హౌస్‌లో ఏం జరిగింది? పునర్నవి నిజంగానే వాకౌట్ చేసిందా? అనేది తెలియాలంటే టుడే ఎపిసోడ్ చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

Bin Laden: ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు పెద్ద తేడా లేదు.. మైఖేల్ రూబిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments