ఆగష్టు 15న ప్రభాస్‌కి త్రిముఖ పోరు తప్పేలా లేదు..! (Video)

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:26 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రం ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కేవలం 28 సెకన్ల నిడివి మాత్రమే ఉంది.


ఫస్ట్ సింగిల్ టీజర్ హై వోల్టెడ్ ఎలెక్ట్రిఫైయింగ్ మ్యూజిక్‌తో హుషారెత్తించే విధంగా ఉంది. కాగా జూలై 8న ఫస్ట్ లిరికల్ సింగిల్ విడుదల కానుంది. సినిమా రిలీజ్ టైం దగ్గరపడడంతో ఈ చిత్ర బృందం సినిమాకి సంబంధించి ప్రమోషన్‌ను షురూ చేసారు.
 
ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ మంగళ్, అలాగే జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన బద్లా హౌస్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మిషన్ మంగళ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంగారక గ్రహంపైకి ఇండియా మామ్ అనే ఉపగ్రహం పంపిన సంగతి తెలిసిందే. దానిని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో పాటు అదే రోజున బద్లా హౌస్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇందులో జాన్ అబ్రహం హీరోగా చేస్తున్నారు. బద్లా హౌస్, సాహో హిందీ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మరి ఈ త్రిముఖపోరులో విజయం సాధించేది ఏ చిత్రమో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments