Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ 'బిగ్‌బాస్'‌కు షాక్... నిలిపివేయాలంటూ డిమాండ్...

తమిళ బిగ్ బాస్‌కు షాక్ తగిలింది. ఈ రియాల్టీ షో ప్రసారాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిజానికి ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వుంది.

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (11:40 IST)
తమిళ బిగ్ బాస్‌కు షాక్ తగిలింది. ఈ రియాల్టీ షో ప్రసారాలు నిలిపివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నిజానికి ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వుంది. 
 
తమిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్‌గా కొన‌సాగుతున్న ఈ బిగ్ బాస్ షోకు వ్య‌తిరేకంగా నేతాజీ సుభాష్ షెనాయ్ సంస్థ ప్రెసిడెంట్ మ‌హ‌రాజ‌న్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జరిగాయి. బిగ్ బాస్ స్టూడియోకు ఓ 40 మంది ఆందోళ‌న‌కారులు చేరుకొని షోకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 
 
ఈ రియాల్టీ షో త‌మిళ‌నాడు సాంప్ర‌దాయాల‌ను మంట‌గ‌లిపేలా ఉంద‌ని.. వెంట‌నే ఈ షోను నిలిపి వేయాల‌ంటూ వారు నినాదాలు చేశారు. ఆ తర్వాత వారంతా బిగ్ బాస్ స్టూడియో లోప‌లికి ప్ర‌వేశించ‌డానికి యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. 
 
రీసెంట్‌గా షోలో జ‌రుగుతున్న కొన్ని టాస్క్‌లు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయ‌ని.. త‌మిళ‌నాడు సాంప్ర‌దాయాల‌ను నాశనం చేసేలా ఉన్నాయనే విమర్శలు చెలరేగిన విషయం తెల్సిందే. మరోవైపు.. షోను నిలిపివేయాల‌ని హైకోర్టులోనూ పిటిష‌న్ దాఖ‌లైన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments