Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోతో నాకు సంబంధం ఉంది : అందుకే టార్చర్ పెట్టారు : అమలాపాల్

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌తో ఉన్న సంబంధంపై హీరోయిన్ అమలాపాల్ పెదవి విప్పింది. ఈ బ్యూటీ ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన తాజా చిత్రం "వీఐపీ–2" ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (09:45 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌తో ఉన్న సంబంధంపై హీరోయిన్ అమలాపాల్ పెదవి విప్పింది. ఈ బ్యూటీ ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన తాజా చిత్రం "వీఐపీ–2" ఈ నెల 11వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా అమలాపాల్‌ భేటీ చూద్దాం.
 
ధనుష్‌కు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. సంబంధం అంటే.. ఆ టైపు సంబంధం కాదు. తామిద్దరం తొలిసారిగా 'వేలైఇల్లా పట్టాదారి' చిత్రంలో నటించాం. ఆ తర్వాత ఆయన నిర్మించిన అమ్మాకణక్కు చిత్రంలో నటించాను. ఇప్పుడు 'వీఐపీ 2'లో నటించాను. ఆ మధ్య వడచెన్నై చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా అంగీకరించలేకపోయినట్టు తెలిపింది. 
 
వాస్తవం చెప్పాలంటే ధనుష్‌తో నటిస్తే నాకు మంచి అనుభవం లభిస్తుంది. ఆయన చాలా హార్డ్‌ వర్కర్‌. ఏ పని చేసినా దానిపై చాలా క్రేజీగా ఉంటారు. నటించేటప్పుడు చాలా మోటివేషన్‌గా ఉంటారు. చాలా స్వీట్‌ పర్సన్‌. నాకు మంచి ఫ్రెండ్‌. నటనలో నాకు ధనుష్‌కు మధ్య పోటీ ఉంటుంది. అది ఆరోగ్యకరంగా ఉంటుంది.
 
సుశీ లీక్స్‌ విషయంలో ధనుష్‌తో కలుపుతూ వదంతులు వచ్చాయి. ఇవి చాలా బాధకు గురిచేశాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్‌ కుమార్‌తో కలిసి నేను 'దైవతిరుమగళ్‌' చిత్రంలో నటించాను. అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి. 
 
ఆరా తీస్తే సుశీలీక్స్‌ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్‌ యూజ్‌ చేశారు. ఈ విషయంలో నన్ను, నటుడు ధనుష్‌ను చాలా టార్చర్‌కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది. ఆ వీడియో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments