Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా కొత్త బిజినెస్‌ ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (17:37 IST)
KE Gnanavel Raja
ప్రముఖ తమిళ నిర్మాత, తెలుగులోనూ చిత్రాల‌ను రిలీజ్ చేసిన  కె.ఇ. జ్ఞానవేల్ రాజా చెన్నయి లో తన కొత్త థియేటర్ ప్రారంభించారు.  ఈయ‌న సూర్య‌, కార్తి చిత్రాల‌ను తెలుగులో విడుద‌ల చేశారు. ఆ కుటుంబానికి చాలా ఆప్తుడు కూడా. ఆదివారం సాయంత్రం ఆయ‌న చెన్న‌ైలో త‌న బేన‌ర్ అయిన గ్రీస్ సినిమాన్ పేరుతో థియేట‌ర్ల‌ను ప్రారంభించారు.  తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. 
 
కాగా తాజాగా ఆయన గ్రీన్ సినిమాస్ అనే బ్రాండ్ తో థియేటర్ ల బిజినెస్ లోకి కూడా వచ్చారు. గ్రూప్ ఆఫ్ థియేటర్స్ ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “సాయి ఆశీర్వాదంతో, మేము గ్రీన్ సినీమాస్ - పాడి రాధా పేరిట పాడి వద్ద మా బ్రాండ్“ గ్రీన్ సినిమాస్ ”క్రింద మొదటి థియేటర్‌ను ప్రారంభిస్తున్నాము. ఇందులో రెండు స్క్రిన్స్ ఉన్నాయి, వీటిలో ఒకటి 384 సీట్లు, మరొకటి 142 సీట్లు. 
 
సినిమా హాళ్లలో 4 కె ప్రొజెక్షన్ ఎ టి ఎం ఓ ఎస్ సౌండ్, 3 డి ప్రొజెక్షన్ సహా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉంది. చక్కగా నిర్వహించబడే విశాలమైన విశ్రాంతి గదులు, క్యాంటీన్‌లో రుచికరమైన స్నాక్స్ మరియు పానీయాలతో ప్రేక్షకులు ఆహ్లాదకరమైన మరియు అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు. 
 
లాబీ, విశాలమైన కారు పార్కింగ్‌, 2 వీలర్ పార్కింగ్ వుంది. సినిమాలను ఎంత గొప్పగా నిర్వహించానో మా థియేటర్ ను కూడా అంత గొప్పగా మెయింటైన్ చేస్తామని తెలిపారు. ఓటిటి. ఆద‌ర‌ణ వున్న త‌రుణంలో థియేట‌ర్లు పెట్ట‌డం స‌మ‌జంస‌మేనా అని కొంద‌రు అడిగారు. ఎప్ప‌టికైనా థియేట‌ర్‌కు విలువ ఎక్కువే. దానికి సాటి మ‌రోటి రాద‌ని జ్ఞ‌నావేల్ రాజా తెలిపారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments