Webdunia - Bharat's app for daily news and videos

Install App

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

దేవీ
శనివారం, 12 ఏప్రియల్ 2025 (12:14 IST)
Priyadarshi Pulikonda, Rupa
జాతకాల నేపథ్యంలో సారంగపాణి జాతకం రాబోతుంది.  హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చాలా ఇష్టపడి  చేసిన సినిమా ఇది. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే వినోదాత్మక చిత్రమిది . యూత్ ను ఆకట్టుకునే క్రైమ్ కామెడీ అంశాలు కూడా ఇందులో ఉన్నాయనీ, ఈ నెల 25 న సమ్మర్ కూల్ స్పెషల్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
 
చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “ మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సినిమా అవుతుంది. కంప్లీట్ ఎంటర్ టైనర్ తీయాలనే నా కోరిక ఈ సినిమా తో నెరవేరింది. ఫస్ట్ కాపీ తో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ నెల 25 న మీకు  రెట్టింపు ఆనందాన్ని కలిగించే విధంగా మా 'సారంగ పాణి జాతకం‘ థియేటర్ల లో విడుదల కానుంది. నిజానికి 18 న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు , మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం. ’బలగం ‘, ‘35’, ‘కోర్టు’ సినిమాలతో ప్రియదర్శి రేంజ్ పెరిగింది. మిమ్మల్ని ఈ సినిమాతో 100 శాతం ఎంటర్టైన్ చేస్తారాయన. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ 'నాని జెంటిల్‌మన్' . ఆ తర్వాత చక్కని ప్రేమకథతో, సుధీర్‌బాబుతో 'సమ్మోహనం' . ఈ రెండూ కూడా మంచి పేరు, సక్సెస్ తెచ్చాయి. ఇప్పుడు ఆ విజయాలను ‘సారంగపాణి జాతకం’ కొనసాగిస్తుంది. ఇలాంటి సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.“ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments