Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సార్... పీవీపీ నుంచి కాపాడండి: బండ్ల గణేశ్

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (13:07 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. 'గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పీవీపీ బారి నుంచి కాపాడండి' అని ఆయన ట్వీట్ చేశారు. 
 
దాని తర్వాత 'రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్' అని, 'ఓడిపోయిన కేసులలో కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే... ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు' అని ఆరోపించారు.
 
'అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిలేని పాలన జరుగుతుందని ఆనందపడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు. వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది' అని మరో ట్వీట్‌ను కూడా బండ్ల గణేశ్ పెట్టారు. 'మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు, దయచేసి కట్టడి చేయండి' అని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments