Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (13:49 IST)
Pawan, priyanka
ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూట్లో నిన్నే జాయిన్ అయ్యారు. మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఈ వారం ప్రారంభంలోనే ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ, ఈ రోజు మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌తో  మన ముందుకు వచ్చారు.
 
'డాక్టర్‌', 'డాన్‌', 'గ్యాంగ్‌ లీడర్', 'శ్రీకారం' వంటి చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్‌ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. ఈ నటి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఆమె తన రూపం, శైలితో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటను తెరపై చూడాలని సినీ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసున్నారు.
 
ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ ముంబై పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు సుజీత్ ఎక్కడా రాజీపడకుండా అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించడానికి కృషి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments