Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా... నిక్ జోనస్ నిశ్చితార్థం పూర్తి.. పెళ్లి ఎప్పుడంటే?

అనుకున్నదే జరిగింది. బిటౌన్ తార ప్రియాంక చోప్రా ప్రియుడినే పెళ్లాడనుంది. ఇందులో భాగంగా ప్రియుడితో అధికారికంగా నిశ్చితార్థం కుదుర్చుకుంది. అవును ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్ నిశ్చితార్థం శనివారం జరిగింద

ప్రియాంక చోప్రా... నిక్ జోనస్ నిశ్చితార్థం పూర్తి.. పెళ్లి ఎప్పుడంటే?
Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (16:09 IST)
అనుకున్నదే జరిగింది. బిటౌన్ తార ప్రియాంక చోప్రా ప్రియుడినే పెళ్లాడనుంది. ఇందులో భాగంగా ప్రియుడితో అధికారికంగా నిశ్చితార్థం కుదుర్చుకుంది. అవును ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్ నిశ్చితార్థం శనివారం జరిగింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ శనివారం ముంబైలో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ప్రియాంకను నిక్ ముద్దాడుతుండటం.. వారి వెనుక ఎన్పీ అనే ఆంగ్ల అక్షరాల డేకరేషన్‌తో ఉన్న ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. జూన్‌లో భారత్ వచ్చిన నిక్.. ప్రియాంక తల్లితో మాట్లాడి.. ప్రియాంకను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దల అంగీకరం లభించడంతో ముందుగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments