Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక కష్టాల్లో అస్సోం.. ప్రచారానికి రోజుకు రూ.1.5 కోట్లు అడిగిన ప్రియాంకా చోప్రా

కాగా డ్వేన్ జాన్సన్(ది రాక్), కెల్లీ రోబచ్, అలెగ్జాండ్రా దడ్డారియో లీడ్ రోల్ చేస్తున్న బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుంది. దీంతో ఈ అమ్మడు పారితోషికం కూడా భారీగానే పెంచేసింది. తాజా

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:43 IST)
మూడు పదుల వయసు దాటినా కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా (32). బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన ప్రియాంక చోప్రా.... ప్రస్తుతం తన దృష్టంతా హాలీవుడ్లో ఎలా ఎదగాలనే దానిపై పెట్టింది. ఇప్పటికే అమెరికాలో ''క్వాంటికో'' అనే టీవీ యాక్షన్ సిరీస్లో అవకాశం దక్కించుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.... ఇప్పుడు ఏకంగాగా హాలీవుడ్ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంది. 
 
కాగా డ్వేన్ జాన్సన్(ది రాక్), కెల్లీ రోబచ్, అలెగ్జాండ్రా దడ్డారియో లీడ్ రోల్ చేస్తున్న బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుంది. దీంతో ఈ అమ్మడు పారితోషికం కూడా భారీగానే పెంచేసింది. తాజాగా... ప్రియాంక చోప్రా అస్సోం టూరిజం క్యాంపెయిన్‌ కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. రోజుకు రూ.1.5 కోట్లిస్తే ఓకే లేకుంటే కుదరదని తేల్చిచెప్పేసిందట. దీంతో వామ్మో అంతరేటా అంటూ అధికారులు కంగుతిన్నారట. ఎంత అంతర్జాతీయ స్టార్‌ అయిన పీసీ అస్సోం టూరిజం క్యాంపెయిన్‌ని ప్రమోట్‌ చేయడానికి అంత మొత్తం అడగడంతో కొందరు ప్రియాంక మీద మండిపడుతున్నారట. 
 
ఆర్థిక కష్టాల్లో ఉన్న అస్సోంకు సాయం చేయాల్సిందిపోయి, అంత డబ్బు అడగడంతో కొందరు ప్రియాంకపై విమర్శలు చేస్తున్నారు. దాంతో ఈ క్యాంపెయిన్‌ని ప్రియాంక ఉచితంగా ప్రచారకార్యకర్తగా వ్యవహరించాలా లేక తన స్టేటస్‌కి తగ్గట్టు పారితోషికం తీసుకోవాలా అన్న విషయం బీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నెట్టింట్లో ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments