Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తి మొక్కుతాం... ప్రజలారా బయటకురావొద్దు : ప్రియాంకా చోప్రా

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (08:37 IST)
దేశ ప్రజలకు బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఓ విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండో దఫా వ్యాప్తి చేయిదాటిపోయింది. ఈ నేపథ్యంలో నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో స్పందించారు. 
 
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని కోరారు. కరోనా తగ్గిపోయిందన్న భ్రమలో గత రెండు నెలలుగా ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వైరస్ మళ్లీ విజృంభిస్తోందని విచారం వ్యక్తం చేశారు. 
 
కరోనా కారణంగా వి లవిల్లాడుతున్న రాష్ట్రాల పరిస్థితి చూస్తుంటే భయంగా ఉందని, పరిస్థితి అదుపుతప్పినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అందరూ ఇళ్లలోనే ఉండాలని అభ్యర్థిస్తున్నట్టు ప్రియాంక చెప్పుకొచ్చారు. 
 
"మీ కోసం, మీ కుటుంబం కోసం, మన బంధువులు, ఫ్రంట్‌లై‌న్ వర్కర్ల కోసం దీనిని పాటించాలని సూచించారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్కులు ధరించాలని, అవసరాన్ని బట్టి చుట్టుపక్కల వారికి సాయం చేయాలని" ప్రియాంక పేర్కొన్నారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరిన ప్రియాంక.. మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు వైద్య రంగంపై ఒత్తిడి తగ్గిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments