Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు కోల్పోయిన ప్రియాంకా - దీపికా

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (15:11 IST)
ఫోర్బ్స్ మేగజైన్‌ తాజాగా ప్రకటించిన సంచికలో భారత నటీమణులు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే చోటుకోల్పోయారు. వీరిద్దరూ గత యేడాది ఫోర్బ్స్‌ మేగజైన్‌ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో టాప్‌-100లో స్థానం దక్కించుకున్నారు. కానీ, ఈ యేడాది మాత్రం వీరిద్దరూ చోటుకోల్పోయారు. 
 
2016లో అధిక ఆదాయం ఆర్జిస్తున్న నటీమణుల్లో టాప్‌10లో చోటు దక్కించుకున్న దీపికా పడుకొనే గత సంవత్సరం నుంచి ఫోర్బ్స్‌లో స్థానం కోల్పోయింది. అయితే, హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జొహన్సన్‌ 56 మిలియన్‌ డాలర్లతో టాప్‌ పొజిషన్‌ను ఆక్రమించింది. 
 
గతేడాది సైతం ఆమె మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌తో టైఅప్‌ అయి చాలా సినిమాల్లో నటించింది. అవెంజర్స్‌ మూవీతో ఆమె భారీ లాభాలు ఆర్జించినట్లు హాలీవుడ్‌ టాక్‌. అవేంజర్స్‌ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
 
రెండో స్థానంలో సోఫియా వెర్గరా 44.1 మిలియన్‌ డాలర్ల ఆర్జనతో రెండో స్థానంలో ఉంది. రీత్‌ విత్‌ర్‌స్పూన్‌ 35 మిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో ఉండగా, టాప్‌ టెన్‌లో మొత్తం హాలీవుడ్‌ హీరోయిన్లే ఉండడం గమనర్హం. 
 
నిరుడు విడుదల చేసిన ర్యాంకుల్లో టాప్‌ 100లో శక్తివంతమైన మహిళల్లో ఉన్న ప్రియాంక చోప్రా తన స్థానాన్ని కోల్పోయింది. ఈ మధ్యే ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న నటుల్లో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments