Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైకి వల్లించేది నీతి సూత్రాలు.. లోలోపల వెధవ పనులు.. ఇదీ ప్రియాంకా చోప్రా తీరు

Advertiesment
పైకి వల్లించేది నీతి సూత్రాలు.. లోలోపల వెధవ పనులు.. ఇదీ ప్రియాంకా చోప్రా తీరు
, సోమవారం, 22 జులై 2019 (11:55 IST)
ప్రియాంకా చోప్రా. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. గత యేడాది ఇంగ్లీష్ పాప్ సింగర్‌ను పెళ్లి చేసుకుని, దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఈమె తాజాగా తన భర్త, తల్లితో కలిసి దమ్మూకొడుతూ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.
 
నిజానికి గతంలో ప్రియాంకా ధూమపానంపై నీతిసూత్రాలు వల్లించింది. ఆరోగ్యానికి ధూమపానం హానికరమంటూ ఊదరగొట్టుడు ప్రచారం చేసింది. ముఖ్యంగా, గత యేడాది ఆస్తమా రోగుల కోసం నిర్వహించిన ఓ అవగాహనా కార్యక్రమంలో ఈ అమ్మడు పాల్గొని పెద్ద లెక్చరర్ ఇచ్చింది. 
 
"తాను ఐదేళ్లప్పుడే ఆస్తమాతో బాధపడ్డానని, అయినప్పటికీ ఆ వ్యాధి తన కలలను అడ్డుకోలేకపోయిందని చైతన్యం నింపే మాటలు చెప్పింది. అలాగే, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని, దీపావళిని దీపాలతోనే జరుపుకోవాలని, పటాసులు కాల్చి కాలుష్యాన్ని సృష్టించొద్దంటూ" హితవు పలికింది. ఇది కేవలం మాటల్లోనే అని ఇపుడు తేలిపోయింది. తాను చెప్పడం వరకేనని, లోపల మాత్రం తాను దమ్ముకొట్టందే ఉండలేననే విధంగా ప్రవర్తించింది. 
 
పైగా, గతంలో ఆమె చెప్పిన మాటలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రియాంకా మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనవుండదంటున్నారు. నాటి నీతి సూత్రాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఫోటో కింద ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 
 
ప్రియాంకా ఆస్తమాతో బాధపడుతుందని ఒకరంటే.. ప్రియాంకా ఆస్తమా నివారణ కోసం కృషి చేస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైగా, దీపావళి రోజున ఎవరూ మతలాబులు కాల్చొదని ఇంకొకరు కామెంట్స్ చేశారు. ఇంకొందరు అయితే స్వరభాస్కర్ నుంచి ప్రియాంకా చోప్రా వరకు మొత్తం నకిలీతో నిండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ తొలి ఎపిసోడ్.. ట్రెండింగ్‌లో నెం.1.. నాగ్ థ్యాంక్స్ ట్వీట్