భర్త కోసం భారత్‌ను వదులుకున్న ప్రియాంక చోప్రా... సల్మాన్ ఫైర్

బుధవారం, 22 మే 2019 (18:20 IST)
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంక చోప్రా పెళ్లి కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నందుకు ప్రియాంకపై సల్మాన్‌కు ఇంకా కోపం తగ్గలేదు. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ప్రియాంక, నిక్ జోనస్‌లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తేదీలను ఖరారు చేసుకున్నారు. 
 
ఇందుకోసం ప్రియాంక భారత్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో దాదాపుగా నాలుగు నెలల నుండి సల్మాన్ ఈ విషయంగా ప్రియాంకపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల మరో ఇంటర్వ్యూలో సల్మాన్ భాయ్ మరోసారి ప్రియాంకపై విరుచుకుపడ్డారు.
 
‘చివరి నిమిషంలో తాను ప్రాజెక్ట్ నుండి తప్పుకొంటున్నట్లు ప్రియాంక చెప్పకపోయి ఉంటే నేను కత్రినా కైఫ్‌తో కలిసి పని చేసే అవకాశం కోల్పోయేవాడిని. ప్రియాంక తప్పుకోవడం వలనే నేను కత్రినాతో కలిసి మరోసారి పని చేయగలిగాను. నేను ప్రియాంక వివాహ విందుకు వెళ్లాను, అప్పటి నుండి కూడా తన నుంచి నాకు ఇప్పటివరకు ఫోన్‌ రాలేదు. 
 
ట్రైలర్‌ విడుదలయ్యాక కూడా తను నాకు ఫోన్‌ చేయలేదు. ఒకవేళ తనకు నిజంగానే ఏదన్నా సమస్య ఉంటే నాకు ఫోన్‌ చేయకపోయినా ఫర్వాలేదు. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. సాధారణంగా నటీనటులు సినిమా కోసం ఏదైనా త్యాగం చేస్తారు. కొంతమంది నటీమణులు భర్తల్ని కూడా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రియాంక మాత్రం తన భర్త కోసం ‘భారత్‌’ను వదులుకుంది’ అని సెటైర్ వేసారు సల్మాన్.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ‘రెడీ రెడీ’ అంటూ రెచ్చగొట్టేస్తోన్న తమన్నా (video)