Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఒరు అడార్ లవ్.. హిందీలో శ్రీదేవి బంగ్లా కోసం.. హాట్‌గా ప్రియా ప్రకాష్ వారియర్

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:50 IST)
కన్నుగీటీ ఓవర్‌నైట్‌లో సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.. తెలుగులో ఓ సినిమాలో నటించనుంది. బాలీవుడ్‌లోనూ అమ్మడుకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన ఒరు అడార్ లవ్ సినిమా ప్రేమికుల రోజున పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమాను ''లవర్స్ డే'' పేరిట తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రైట్స్‌ను నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం చాలా మంది ప్రయత్నించారని, ఫైనల్‌గా తమకు దక్కాయని నిర్మాతలు చెప్పారు. ఇక తెలుగులో కూడా ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 
 
కాగా కన్నుగీటి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంటర్నెట్ క్వీన్‌గా పేరున్న ప్రియా ప్రకాష్ వారియర్.. తన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తోంది. ఒక్క సినిమా కూడా ఆమెది ఇంకా విడుదల కాకుండానే.. నెట్టింట అమ్మడుకు బ్రహ్మరథం పట్టే ఫాలోయిర్స్ పెరిగిపోతూ వున్నారు.
 
ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలను షేర్ చేస్తూ.. ఫాలోయిర్స్‌ను పెంచుకునే ఈ ముద్దుగుమ్మ ఇటీవల సెక్సీ ఫోటోలను పోస్టు చేసింది. బాత్ టబ్‌లో, ఇన్నోసెంట్ లుక్‌లో ప్రియా ప్రకాష్ వారియర్ అదరగొట్టేసింది. 
 
ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రశాంత్‌తో శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసమే ప్రియా ప్రకాష్ వారియర్ అదిరిపోయే స్టిల్స్‌కు ఫోజిచ్చిందని సినీ జనం అనుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం