Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" నుంచి 'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ విడుదల

డీవీ
గురువారం, 21 మార్చి 2024 (15:30 IST)
AR rehamn song
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్నందించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి  'తేజమే రెహమానేనా..' అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేశారు.
 
'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. 'తేజమే రెహమానేనా తేజమే రహీమ్, యాడున్నావో యాడున్నావో గుండె తడవగ వానై పో..ఉప్పే లేని కన్నీరొలికి, ఆవిరి పెదవుల తాకగ రా..ఆటు పోటుల ఆకలి ఎడారిలో చూడన చూడన నీ కలకై...' అంటూ ఎడారి కష్టాల్లో ఉన్న హీరో తన ప్రేయసిని తల్చుకుంటూ పాడే ఎమోషనల్ సాంగ్ ఇది. ఈ పాటలో రెహమాన్ కనిపించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరిగిన ఏడారికి స్వయంగా వెళ్లిన రెహమాన్ ..అక్కడ హీరో క్యారెక్టర్ పడే సంఘర్షణను, ప్రకృతిని తానూ అనుభూతి చెందుతాడు. ఆ ఫీల్ తోనే ఈ పాట కంపోజ్ చేసినట్లు రెహమాన్ లిరికల్ వీడియోలో వెల్లడించారు.
 
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments