Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ది గోట్ లైఫ్ చిత్రాన్ని లారెన్స్ ఆఫ్ అరేబియా తో పోల్చిన ఏఆర్ రెహమాన్

AR Rahman at press conference

డీవీ

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (16:19 IST)
AR Rahman at press conference
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఎక్స్ క్లూజివ్ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాను వరల్డ్ క్లాసిక్ మూవీ "లారెన్స్ ఆఫ్ అరేబియా"తో పోల్చారు. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని ఏఆర్ రెహమాన్ చెప్పారు.

సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను మార్చి 10న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సినిమా మార్చి 28న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లోకి రాబోతోంది.
 
"ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. 
 
ఈ సినిమాను ఒక యజ్ఞంలా పూర్తిచేశారు మూవీ టీమ్. ఎడారి లొకేషన్స్ ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ అరుదైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. కోవిడ్ పాండమిక్ ను కూడా ఎదుర్కొని బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) ఇవ్వనుంది.
 
నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకట్టుకుంటోన్న త్రిగుణ్, ఆయుషి పటేల్ ‘చూసుకో’ వీడియో సాంగ్