Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటలక్కకు బంటు పిచ్చి

Webdunia
గురువారం, 27 మే 2021 (17:10 IST)
Premi viswanath
అల్లు అర్జున్ అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. ఇటీవ‌లే త‌న ఇష్టాన్ని శ్రీ‌ముఖి కూడా ఐల‌వ్‌యూ.. అంటూ ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌కు వ్య‌క్తం చేసింది. ఇక ఒక‌డుగు ముందుకు వేసి అల్లు అర్జున్ హాష్ టాగ్‌ను హాక్ చేసింది న‌టి ప్రేమి విశ్వ‌నాథ్‌. ఈమె కార్తీక దీపం సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌గా ప్ర‌సిద్ధి. సీరియ‌ల్‌లో డ‌ల్ ఫేస్‌తో వుంటూ భ‌ర్తకు దూర‌మైనా అత‌న్ని మార్చాల‌ని ప్ర‌య‌త్నించే అమ్మాయిగా న‌టించింది. సీరియ‌ల్‌లో ఆమెకు లేడీస్ అభిమానులే ఎక్క‌వే. అయితే బ‌య‌ట ఆమె రెబ‌ల్‌గా వుంటుంది. త‌న కిష్ట‌మైంది చేసేస్తుంది. అలాంటిదే త‌న సోష‌ల్‌మీడియాలో అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేస్తూ ట్వీట్ చేసింది.
 
premi_vishwanath
అల వైకుంఠ‌పురంలో సినిమాలోని `చిత్త‌రాల సిర‌ప‌డు` అనే పాట‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఆస‌క్తిగా తెర‌కెక్కించాడు. మాస్ బీట్‌తో ఫైట్‌తో అల్లు అర్జున్ అల‌రించాడు. ఆ రేంజ్‌లో వంట‌ల‌క్క కూడా ఫాలో అయింది. లుంగీక‌ట్టు, పూల చొక్కా, చేతిలో సిగ‌రెట్‌, నోటిలోంచి గుప్ మ‌నే పొగ వ‌దులుతూ, గాలిలో ఎగిరే కోడిపుంజును పెట్టుకుని త‌న అచార‌క‌మైన ఫొటోను సోష‌ల్‌మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది. ఇది త‌న సోద‌రుడు తీశాడ‌ని కోడిపుంజు అలా ఎగిరేలా రావ‌డానికి కొంచెం క‌ష్ట‌ప‌డ్డామ‌ని తెలిపింది. పైగా త‌న ఫాలోవ‌ర్స్‌కు నో స్మోకింగ్ అంటూ కింద కామెంట్ పెట్టింది. ఇలా చేయ‌డానికి కార‌ణం అల్లు అర్జున్ అంటే త‌న‌కి పిచ్చి అభిమానం అంటూ తెలియ‌జేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments