Webdunia - Bharat's app for daily news and videos

Install App

జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించిన ప్రశాంత్ వర్మ

డీవీ
మంగళవారం, 23 జనవరి 2024 (11:02 IST)
Jai hanuman poster
ప్రపంచవ్యాప్తంగా 'హను-మాన్' చారిత్రాత్మక విజయం తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు.
 
Prashant Varma, pre-production stared
ప్రీక్వెల్ ముగింపులో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ 'అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నారు. ఇది లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ కాన్వాస్, అగ్రశ్రేణి ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించబోతోంది.
 
ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ప్రశాంత్ వర్మ గొప్ప సందర్భాన్ని ఎంచుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచారు. ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని వారు భావించారు.
 
రెండు పోస్టర్లను విడుదల చేశారు. ఒకటి ప్రశాంత్ వర్మ హనుమంతుని ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు చూపిస్తే, మరొకటి సీక్వెల్ ప్రకటించిన హను-మాన్ నుండి చివరి సీక్వెన్స్‌ను చూపుతుంది.
 ఈ మాగ్నమ్ ఓపస్ సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

చిల్లర్లేదు.. ఇక రాయన్న రైల్వేస్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ : ఏపీ సర్కారు తొలి కేబినెట్ నిర్ణయాలివే...

రానున్న మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

ఆ యాప్‌ డౌన్ లోడ్ చేయొద్దని చెప్పిన తండ్రి.. బాలిక ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments