Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమౌళి వల్ల డ్రాప్ అయ్యా - హనుమాన్ షూట్ లో అపశ్రుతులు : ప్రశాంత్ వర్మ

Advertiesment
Prashant Varma

డీవీ

, గురువారం, 11 జనవరి 2024 (16:03 IST)
Prashant Varma
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ  సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్ర ఖని తదితరులు నటించారు. జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ప్రశాంత్ వర్మతో చిట్ చాట్.
 
ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్' అన్నారు. కానీ ఎన్.టి.ఆర్. చేశారే?
అవును. మేము ముందు మాదే అనుకున్నాం. కానీ ఆ తర్వాత తెలిసింది. సూపర్ మాన్ అనే పేరుతో అప్పట్లోనే ఎన్.టి.ఆర్. చేశారు. అందుకే ఆ ఛాయలు కనిపించేలా మెయిన్ టేన్ చేశాం. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.
 
బాలీవుడ్ లో ప్రమోషన్ కు వెళ్ళారు గదా? ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది?
మేము మొదట కొంచెం సంశయంతోనే వున్నాం. వెళ్ళిన చోటల్లా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సినిమాఏమిటి? అని అడిగారు. సౌత్ నుంచి వచ్చాం.  తెలుగులో సినిమా తీశాం అనగానే వాళ్ళు మంచి అప్లాజ్ ఇచ్చారు. 
 
జాంబిరెడ్డి గానీ అంతకుముందు సినిమా కానీ మీ కథలో దైవభక్తి అంశం వుంటుంది? కారణం?
అది మన సంప్రదాయం. దేవుడు, భక్తి అనేది మనంలో ఇమిడిపోయాయి. హనుమాన్ లో కూడా ఓ సామాన్యుడు భయస్తుడైతే హనుమంతుడు సహకారంతో ఏ స్థాయికి వెళ్ళాడు అన్నది చూపించాం. అయితే క్రిష్ణవంశీగారి శ్రీ ఆంజనేయంలో లాగా తేజ్ కు పక్కన ఎవరూ వుండరు. అదే ఈ సినిమా.
 
ఈ సినిమా షూట్ లో మర్చిపోని సంఘటనలు?
ఇది చెప్పాల్సిన అంశం. తేజ్ సజ్జ రెండు ఎద్దులున్న బండిని తోలుతూ వెళతాడు. మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో షూట్ చేశాం. అంతా సీన్ రెడీ అయింది. ఎద్దులు బెదురుతాయోనని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎఫెక్ట్ గా రావాలని డ్రోమ్ కెమెరా వాడాం. కానీ ఆ సౌండ్ కు అవి రావడం చూసి బెదిరిపోయి పరుగెత్తాయి. అటు ఇటూ పరుగెత్తాయి. అలా కొండపైన చివరకు వెళ్ళి షడెన్ గా ఓ మార్గంలోకి వెళ్ళాయి. ఆ పక్కనే మరో మార్గం వుంది. అటువైపు వెళితే లోయలోకి వెల్ళిపోయేవి. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది.
 
అదేవిధంగా మరోచోట తేజ్ సజ్జ ఓ చెట్టు దగ్గర నుంచి నేను షాట్ అనగానే రావాలి. నేను షాట్ అని చెబుతున్నా తను కదలలేదు. మోనిటర్ లో చూస్తూ ఎందుకు రావడంలేదు? అని అసిస్టెంట్ ను అడిగాను. సార్.. ఆయన వెనుక పాము వుంది సార్. చెట్టుపై వేలాడుతుంది అన్నాడు. నేను షాక్ అయ్యాను. తేజ్ నల్లటి డ్రెస్ లో వున్నాడు. పాము కూడా నల్లగా వుంది. నల్ల తాచు అనుకుంట. అలా కదలకపోవడం వల్ల తేజ్ సేవ్ అయ్యాడు. మోనిటర్ లో అతని దుస్తులతో మ్యాచ్ అయి పాము నాకు కనబడలేదు. ఇలా కొన్ని జరిగాయి.
 
మహాభారతం సినిమా తీయాలనుందని గతంలో అన్నారు?
అవును. కానీ రాజమౌళిగారు తీస్తున్నారు అనగానే నేను తప్పుకున్నాను.
 
మీ రాబోయే సినిమాలు?
ఎవెంజర్స్ తరహాలో తెలుగు కథలతో సినిమాలు చేయాలి. నా దగ్గర పలు కథలున్నాయి. హనుమన్ విజయాన్ని బట్టి అవి ముందుకు తీసుకువస్తాను.. అని ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతార-విఘ్నేష్‌లు విడాకులు తీసుకుంటారా? వేణు స్వామి ఏమన్నారు..?