Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరకులో అందంగా చిత్రీకరించిన ప్రణయగోదారి పాట : శేఖర్ మాస్టర్

డీవీ
మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:12 IST)
Pranayagodari team with Shekhar Master
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నేపథ్యంలో పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.
 
ప్రణయ గోదారి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ సాగే ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచేలా ఉన్నాయి. ధనుంజయ్,  అదితి భావరాజు ఆలపించిన ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది.
 
 శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయగోదారి పాటను ఇప్పుడే చూశాను. చాలా బాగుంది. దర్శక నిర్మాత విఘ్నేష్ ఎంతో ప్యాషన్‌తో సినిమా తీశాడని అర్థం అవుతోంది. మోహన్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అరకులో అందంగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments