Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్‌ రాజ్.. ఎందుకు?

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (11:58 IST)
తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి నటుడు ప్రకాష్‌ రాజ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎపిలో మాత్రం మూడు పార్టీలలో ఏ పార్టీకి మద్ధతు ప్రకటించలేదాయన. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పార్టీకి ఒక దిశానిర్దేశం లేదు.. ఒక ప్రణాళిక లేదు. అలాంటి పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారికి ఆ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు సాధారణంగా మద్దతు తెలుపుతారు. కానీ నాకెందుకో పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరు నచ్చలేదన్నారు ప్రకాష్‌ రాజ్.
 
పవన్‌ని మాత్రమే కాదు జగన్ పైన కూడా విమర్శలు చేశారు ప్రకాష్‌ రాజ్. వైసిపి బిజెపితో జత కట్టే అవకాశముంది కాబట్టి ఆ పార్టీని కూడా నమ్మలేమన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిశాడు కనుక ఆయన్ను కూడా నమ్మలేనని, కాబట్టి ఎపిలో ఏ పార్టీకి తాను మద్దతిచ్చే అవకాశం లేదన్నారు ప్రకాష్‌ రాజ్. పవన్ కళ్యాణ్‌ పైన ప్రకాష్‌ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేగుతోంది. అటు తెలుగు సినీ పరిశ్రమలోను, ఇటు రాజకీయ నాయకుల మధ్య ఇదే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments